Skip to main content

Posts

Showing posts from November, 2019

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె

సతులాల చూడరే (Satulala Choodare - LYRICS)

రచన : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు  పల్లవి : సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు చరణాలు : పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు Listen Online -  https://gaana.com/song/sathulala-choodare