రచన : శ్రీతాళ్ళపాక అన్నమాచార్య రాగం : లలిత పల్లవి : జ యలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ చరణాలు : పాలజలనిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మ చందురుతోడబుట్టిన సంపదల మెరగువో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై వుందానవు మా యింటనే వుండవమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమ చెదరని వేదముల చిగురు బోడి ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ