రచన  : శ్రీభద్రాద్రిరామదాసు  రాగం : పంతువరాళి  తాళం  : రూపక  పల్లవి: ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా  అను పల్లవి: సన్నుతించు శ్రీరామచంద్రు తలచవే మనస? కన్నవిన్నవారి వేడుకొన్న  నేమిఫలము మనస? ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా చరణము: రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా?