Skip to main content

ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా (Ennagaanu Ramabhajana kanna mikkilunnada)

రచన : శ్రీభద్రాద్రిరామదాసు 

రాగం : పంతువరాళి 

తాళం : రూపక 



పల్లవి:

ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా 


అను పల్లవి:

సన్నుతించు శ్రీరామచంద్రు తలచవే మనస?

కన్నవిన్నవారి వేడుకొన్న 

నేమిఫలము మనస?


ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా


చరణము:

రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి

రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా

ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు

కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా?

Comments

Popular posts from this blog

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె...

కొలువైయున్నాడే కోదణ్డపాణి ( Koluvaiyunnade Kodandapani - LYRICS )

కృత కర్త: త్యాగరాజ రాగం: దేవగాంధారి తాళం: ఆది పల్లవి: కొలువైయున్నాడే కోదణ్డపాణి అనుపల్లవి: సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 1: జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక వచనములచే తోషించి యాశ్రితుల పోషించి ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 2: వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వగీషులు సేవింప మేను పులకరింప ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 3: ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

సామాజ వర గమన ( Samaja Vara Gamana - LYRICS)

రచన : శ్రీ త్యాగరాజ  పల్లవి: సామాజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత అనుపల్లవి: సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ చరణం: వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ