Skip to main content

ఎందరో మహానుభావులు (Endaro Mahanubhavulu - LYRICS)


కృతకర్త: శ్రీ త్యాగరాజాచార్యులు 
రాగం: శ్రీ 
తాళం: ఆది



ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు


Comments

Popular posts from this blog

సామాజ వర గమన ( Samaja Vara Gamana - LYRICS)

రచన : శ్రీ త్యాగరాజ  పల్లవి: సామాజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత అనుపల్లవి: సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ చరణం: వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ

దుడుకు గల నన్నే దొర (Duduku gala nanne dora)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : గౌళ తాళం : ఆది   దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర దుడుకు గల నన్నే దొర సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన దుడుకు గల నన్నే దొర పర ధనముల కొరకు నొరుల మదిని కరగబలికి కడుపు నింప దిరిగినట్టి దుడుకు గల నన్నే దొర తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి దుడుకు గల నన్నే దొర తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై సుభక్తులకు సమానమను దుడుకు గల నన్నే దొర దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన దుడుకు గల నన్నే దొర చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన దుడుకు గల నన్నే దొర మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక మద మత్సర కామ లోభ మోహ...

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె...