కృత కర్త: త్యాగరాజ
రాగం: దేవగాంధారి
తాళం: ఆది
రాగం: దేవగాంధారి
తాళం: ఆది
పల్లవి:
కొలువైయున్నాడే కోదణ్డపాణి
కొలువైయున్నాడే కోదణ్డపాణి
అనుపల్లవి:
సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

చరణం 1:
జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి
మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక
వచనములచే తోషించి యాశ్రితుల పోషించి
||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

చరణం 2:
వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ
నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వగీషులు సేవింప మేను పులకరింప

చరణం 3:
ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి
సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య
త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య

Super
ReplyDelete