Skip to main content

Posts

Showing posts from June, 2020

కాల సంహార (Kaala Samhara)

కృతికర్త : శ్రీత్యాగరాజ  రాగం : సౌరాష్ట్ర  తాళం : ఆది   పల్లవి : కాల సంహార కరుణాకర  కైవల్యప్రద కమనీయానన  అనుపల్లవి : శీల  శూల ధారి వేగమే  బాల సుచరితుని పాలించిన      || కాల సంహార ||  చరణం : పూర్ణ కటాక్షములో పునర్జన్మములేక  పుణ్యము చేయు కీర్తితో నా యెడ  గణ్య కార్యమును గురుతు తెలుపవే  జగాన శ్రీత్యాగరాజ నమ్మిన       || కాల సంహార || 

గోవింద సుందర (Govinda Sundara)

కృతికర్త : శ్రీరామదాసు   తాళం : త్రిపుట   రాగం : మోహనం  పల్లవి: గోవింద సుందర మోహన దీన మందార గరుడ వాహన భవబంధాది దుష్కర్మ  దహన భక్తవత్సల త్రిలోక పావన  చరణం 1: సతి సుతులపై ప్రేమ రోసితి  సంతతము మీపై భారము వేసితి  మదిలోన మిము కనులజూడగ నెంచి  మీదయ కెపుడెదురెదురు జూచితి  చరణం 2: చాల దినములనుండి వేడితినే   కాలహరణము చేసి గనలేనైతి  మేలు నీ నామము పాడితి   మేలుగా ముందటి విధమున వేడితి   చరణం 3:  దీనరక్షకుడవని వింటిని నీ   కనికర మే తీరున గందును మానసమున నమ్మియుందును నా  మనవి చేకొన వేమందును  చరణం 4: అధికుడవని నమ్మినందుకు  ఆశ్రయించిన శ్రమబెట్టేదెందుకు మిము  వెతకి తెలిసే దెందుకు  మాకిది పూర్వకౄత మనేటందుకు  చరణం 5:   క్రోధాన వచ్చెను వార్థక్యము యిక  ప్రాపేది బహు సామీప్యము పదములు  విడనందు గోప్యమా  మీరెపుడు చూపెదరు స్వరూపము  చరణం 6: భద్రగిరియందు లేదేమొ యునికి  భక్తుల మొరవిని రావేమొ కరిగాచిన హరివి గాదేమో రామ   దాసుని మొరవిని రావేమో