కృతికర్త : శ్రీరామదాసు
తాళం : త్రిపుట
రాగం : మోహనం
తాళం : త్రిపుట
రాగం : మోహనం
పల్లవి:
గోవింద సుందర మోహన దీన మందార
గరుడ వాహన భవబంధాది దుష్కర్మ
దహన భక్తవత్సల త్రిలోక పావన
చరణం 1:
సతి సుతులపై ప్రేమ రోసితి
సంతతము మీపై భారము వేసితి
మదిలోన మిము కనులజూడగ నెంచి
మీదయ కెపుడెదురెదురు జూచితి
చరణం 2:
చాల దినములనుండి వేడితినే
కాలహరణము చేసి గనలేనైతి
మేలు నీ నామము పాడితి
మేలుగా ముందటి విధమున వేడితి
చరణం 3:
దీనరక్షకుడవని వింటిని నీ
కనికర మే తీరున గందును
మానసమున నమ్మియుందును నా
మనవి చేకొన వేమందును
చరణం 4:
అధికుడవని నమ్మినందుకు
ఆశ్రయించిన శ్రమబెట్టేదెందుకు మిము
వెతకి తెలిసే దెందుకు
మాకిది పూర్వకౄత మనేటందుకు
చరణం 5:
క్రోధాన వచ్చెను వార్థక్యము యిక
ప్రాపేది బహు సామీప్యము పదములు
విడనందు గోప్యమా
మీరెపుడు చూపెదరు స్వరూపము
చరణం 6:
భద్రగిరియందు లేదేమొ యునికి
భక్తుల మొరవిని రావేమొ కరిగాచిన
హరివి గాదేమో రామ
దాసుని మొరవిని రావేమో
Comments
Post a Comment