Skip to main content

భజరే శ్రీరామం (Bhajare Sriramam)

కృతికర్త : శ్రీభద్రాచల రామదాసు 

రాగం : వకుళాభరణం 

తాళం: ఆది 



పల్లవి:

భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం రామం

భజ రఘురామం భండన భీమం రజ నిచ రాఘవ రామం రామం


చరణములు:

వనరుహ నయనం వనరుహ శయనం

మనసిజ కోటి సమానం మానం  ||భజరే శ్రీరామం||


తారక నామం దశరథ రామం

చారు భద్రాద్రీశ చారం ధీరం  ||భజరే శ్రీరామం||


సీతరామం చిన్మయ ధామం

శ్రీ తులసీదళ శ్రీకర ధామం  ||భజరే శ్రీరామం||


శ్యామల గాత్రం సత్యచరిత్రం

రామదాస హృద్రాజీవమిత్రం  ||భజరే శ్రీరామం||


Meaning:

Chant the name of Sri Rama in your mind, chant the name of Raghurama

Praise Raghurama who is formidable in war, true jewel of Raghu dynasty


One with flower-like eyes and one who sleeps on tree leaves (vata patra)

One who shines in millions of minds and one who is a standard for qualities


One whose name redeems of all worldly matters, the son of Dasaratha

One who dwells in the great Bhadradri hills and who is valiant and majestic


Rama who is Sita’s consort and who resides in supreme consciousness

Who resides with Sri Lakshmi represented by the holy basil leaf


One who has dark blue body and whose life represents Truth

One who is the supporting friend of Ramadasa’s heart


Source: https://pedia.desibantu.com/bhajare-shriramam/

Comments

Popular posts from this blog

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె

కొలువైయున్నాడే కోదణ్డపాణి ( Koluvaiyunnade Kodandapani - LYRICS )

కృత కర్త: త్యాగరాజ రాగం: దేవగాంధారి తాళం: ఆది పల్లవి: కొలువైయున్నాడే కోదణ్డపాణి అనుపల్లవి: సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 1: జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక వచనములచే తోషించి యాశ్రితుల పోషించి ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 2: వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వగీషులు సేవింప మేను పులకరింప ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 3: ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

దినమే సుదినము సీతారామ

రచన : శ్రీరామదాసు   రాగం : కాపి  తాళం : త్రిపుట      పల్లవి: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే || చరణం 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే || చరణం 2:  అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే || చరణం 3:  నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే || చరణం 4:  మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే || చరణం 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే || చరణం 6:  భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే || చరణం 7:  దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||  చరణం 8:  అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||