Skip to main content

సీతా కళ్యాణ వైభోగమే (Sita kalyana Vaibhogame)

కృతికర్త : శ్రీత్యాగరాజ 
రాగం : శంకరాభరణం 
తాళంఖండలఘువు

LORD SITA RAMA KALYANAM-- Archives – Vaartha


పల్లవి :

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే  || సీతా || 

అనుపల్లవి :

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర  || సీతా || 

చరణాలు :
 
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల  || సీతా || 


పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ  || సీతా || 


సర్వలోకాధార సమరైక ధీర
గర్వమానసదూర కనకాగ ధీర  || సీతా || 


నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాఘ విదార నత లోకాధార  || సీతా || 


పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత  || సీతా || 


Meaning:

How grand and imposing the wedding of Sita is! Praised by Anjaneya, this Hero of countless exploits, having the sun and the moon as His eyes, and possessing a frame of ravishing beauty is an unfailing Protector of His devotees and Bestower of prosperity and Beatitude, which is a part of His Leelaas. 
He causes terror in the minds of Rakshasaas. His calmness and composure reveal Him as one who has no more desires to be fulfilled. 
Sporting a radiant blue hue, He is the source of Bliss for the world. Resider of Ayodhya, He is the Prop of the entire world. 
A peerless warrior in battles, He is beyond the ken of men of arrogance and haughtiness. He is tall and courageous, reminding one of the great Mount Meru. 
He is the Hero figuring in the Scriptures. With an unmatched form, He is the mainstay of His devotees, whose sins He wipes out graciously. 
Celebrated by Lord Siva in song and music, He is the raft enabling deserving mortals to cross the ocean of Samsaara. 
That is the aim of His incarnation in the solar race, He whom TyAgarAja worships.

Comments

Popular posts from this blog

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె

కొలువైయున్నాడే కోదణ్డపాణి ( Koluvaiyunnade Kodandapani - LYRICS )

కృత కర్త: త్యాగరాజ రాగం: దేవగాంధారి తాళం: ఆది పల్లవి: కొలువైయున్నాడే కోదణ్డపాణి అనుపల్లవి: సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 1: జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక వచనములచే తోషించి యాశ్రితుల పోషించి ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 2: వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వగీషులు సేవింప మేను పులకరింప ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 3: ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

దినమే సుదినము సీతారామ

రచన : శ్రీరామదాసు   రాగం : కాపి  తాళం : త్రిపుట      పల్లవి: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే || చరణం 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే || చరణం 2:  అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే || చరణం 3:  నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే || చరణం 4:  మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే || చరణం 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే || చరణం 6:  భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే || చరణం 7:  దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||  చరణం 8:  అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||