Skip to main content

దినమే సుదినము సీతారామ

రచన : శ్రీరామదాసు 

రాగం : కాపి 

తాళం : త్రిపుట 

 

 Personalities: Bhadrachalam Ramadasu | Andhra Cultural Portal

పల్లవి:

దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే ||


చరణం 1:

ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి

చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే ||
చరణం 2: 

అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ

సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే ||
చరణం 3: 

నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు

వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే ||
చరణం 4: 

మృదంగ తాళము తంబురశృతి గూర్చి

మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే ||
చరణం 5:

ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ

మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే ||
చరణం 6: 

భక్తులతో ననురక్తిని గూడక

భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే ||
చరణం 7: 

దీనశరణ్య మహానుభావ యోగానలోల

నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే || 

చరణం 8: 

అక్కరతోడ భద్రాచలమునను

చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||

Comments

Popular posts from this blog

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె...

ఎందరో మహానుభావులు (Endaro Mahanubhavulu - LYRICS)

కృతకర్త : శ్రీ త్యాగరాజాచార్యులు   రాగం : శ్రీ  తాళం : ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనుల...

సతులాల చూడరే (Satulala Choodare - LYRICS)

రచన : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు  పల్లవి : సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు చరణాలు : పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు Listen Online -  https://gaana.com/song/sathulala-choodare