కృతికర్త : శ్రీత్యాగరాజ
రాగం : అభేరి
తాళం: ఆది
పల్లవి:
నగుమోము గనలేని
నా జాలి దెలిపి
నన్ను బ్రోవగ రాద శ్రీ రఘువర!నీ
అనుపల్లవి:
నగరాజధర నీదు పరివారు లెల్ల
ఒగి బోధన జేసేడువారలు గారె? అటు లండుదురే?నీ
చరణం:
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో
గగనానికి బహు దూరం బనినాడో?
జగమేలే పరమాత్మ! యెవరితో మొఱలిడుదు?
వగ చూపకు తాళనునన్నెలుకోరా: త్యాగరాజనుత!
Comments
Post a Comment