Skip to main content

Posts

దుడుకు గల నన్నే దొర (Duduku gala nanne dora)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : గౌళ తాళం : ఆది   దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర దుడుకు గల నన్నే దొర సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన దుడుకు గల నన్నే దొర పర ధనముల కొరకు నొరుల మదిని కరగబలికి కడుపు నింప దిరిగినట్టి దుడుకు గల నన్నే దొర తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి దుడుకు గల నన్నే దొర తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై సుభక్తులకు సమానమను దుడుకు గల నన్నే దొర దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన దుడుకు గల నన్నే దొర చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన దుడుకు గల నన్నే దొర మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక మద మత్సర కామ లోభ మోహములక
Recent posts

శ్రీ విఘ్నరాజాం భజే (Sri Vignaraajaam Bhaje)

రచన : ఓతుకాడు వెంకట సుబ్బాయ్యర్ రాగం : గంభీర  పల్లవి:   శ్రీ విఘ్నరాజాం భజే (7) అనుపల్లవి : సంతతం మహం కుంజర ముఖం శంకర సుతం  తమిహ శ్రీ విగ్న రాజాం భజే సన్నితాతమహం దంతి కుంజర ముఖం   సుతం శివ శంకరి సుతం-తమిహ శ్రీవిఘ్నరాజాం భజే చరణం:  సేవిత సురేంద్ర మహానీయ గుణ శీలం జప తప సమాధి సుఖ వరదా నుకూలం భావిత సురమని ఘనుభక్త పరిపాలం భయంకర విషాంగ మతంగ కులకాలం శ్రీవిఘ్నరాజాం భజే చరణం:- కనక కేయురా హారావాలి కలిత  గంభీర గౌరగిరి  శోభమ్ సుశోభమ్ కామాధి భయ భరిత మూఢ మధ కలి కలుశ  కాంతితా అఖండ ప్రతాపం- సనక సుఖ నారద పతంజలి పరాశర   మతంగ ముని సంగ - సల్లాపం  సత్య పరమభజ నయన ప్రముద ముక్తికార తత్వమసి నిత్య నిఘమాది స్వరూపం శ్రీవిఘ్నరాజాం భజే

ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా (Ennagaanu Ramabhajana kanna mikkilunnada)

రచన : శ్రీభద్రాద్రిరామదాసు  రాగం : పంతువరాళి  తాళం : రూపక  పల్లవి: ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా  అను పల్లవి: సన్నుతించు శ్రీరామచంద్రు తలచవే మనస? కన్నవిన్నవారి వేడుకొన్న  నేమిఫలము మనస? ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా చరణము: రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా?

బంటురీతిఁ గొలు వీయవయ్య రామ (Bantureethi kolu veeyavayya Rama)

రచన : శ్రీత్యాగరాజు  రాగం : హంసనాదం  తాళం : దేశాది  పల్లవి: బంటురీతిఁ గొలు వీయవయ్య రామ    అను పల్లవి: తుంటవింటివాని మొదలైన మదా దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ  బంటురీతిఁ గొలు వీయవయ్య రామ  చరణము(లు): రోమాంచమనే ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్లయు రామనామ మనే వరఖడ్గము వి రాజిల్లనయ్య త్యాగరాజునికే ॥

నన్ను కన్నతల్లి నా భాగ్యమా (Nannu Kannatalli naa Bhagyama)

కృతికర్త : శ్రీత్యాగరాజు  రాగం : సింధుకన్నడ తాళం : దేశాది పల్లవి:  నన్ను కన్నతల్లి నా భాగ్యమా ॥ నన్ను కన్నతల్లి నా భాగ్యమా నారాయణీ ధర్మాంబికే అను పల్లవి: కనకాంగి రమాపతి సోదరి కరుణించవే కాత్యాయని ॥ నన్ను కన్నతల్లి నా భాగ్యమా ..  చరణము: కావు కావు మని నే మొఱబెట్టగా కరఁగదేమి మది కమలలోచని నీవు బ్రోవకున్న యెవరు బ్రోతురు స దా వరం బొసగు త్యాగరాజనుతె ॥

ఏమని చెప్పఁగవచ్చు (Emani Cheppagavachu)

కృతికర్త : శ్రీతాళ్లపాక అన్నమాచార్య  రాగం : భైరవి  పల్లవి :  ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ చరణం 1 :  వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపువ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ॥ఏమ॥ చరణం 2 :  వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ॥ఏమ॥ చరణం 3 :  అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ॥ఏమ॥

దినమే సుదినము సీతారామ

రచన : శ్రీరామదాసు   రాగం : కాపి  తాళం : త్రిపుట      పల్లవి: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే || చరణం 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే || చరణం 2:  అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే || చరణం 3:  నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే || చరణం 4:  మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే || చరణం 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే || చరణం 6:  భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే || చరణం 7:  దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||  చరణం 8:  అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||