Skip to main content

Posts

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె...

సతులాల చూడరే (Satulala Choodare - LYRICS)

రచన : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు  పల్లవి : సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు చరణాలు : పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు Listen Online -  https://gaana.com/song/sathulala-choodare

అంతయు నీవే హరి పుండరీకాక్ష (Antayu Neeve Hari Pundarikaksha - LYRICS)

కృతకర్త : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య  రాగం : పాడి  పల్లవి: అంతయు నీవే హరి పుండరీకాక్ష   చెంత నాకు నీవే శ్రీరఘురామ  చరణం : కులమును నీవే గోవిందుడా నా   కలిమియు నీవే కరుణానిధి   తలపును నీవే ధరణీధర నా  నెలవును నీవే నీరజనాభ  చరణం : తనువును నీవే దామోదర నా  మనికియు నీవే మధుసూదన   వినికియు నీవే విట్ఠలుడా నా  వెనకముందు నీవే విష్ణు దేవుడా  చరణం : పుట్టుగు నీవే పురుషోత్తమ  కొన నట్టనడుము నీవే నారాయణ  ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు  నెట్టన గతి ఇంక నీవే నీవే  FOR SONG -  CLICK HERE

ఎందరో మహానుభావులు (Endaro Mahanubhavulu - LYRICS)

కృతకర్త : శ్రీ త్యాగరాజాచార్యులు   రాగం : శ్రీ  తాళం : ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనుల...

కొలువైయున్నాడే కోదణ్డపాణి ( Koluvaiyunnade Kodandapani - LYRICS )

కృత కర్త: త్యాగరాజ రాగం: దేవగాంధారి తాళం: ఆది పల్లవి: కొలువైయున్నాడే కోదణ్డపాణి అనుపల్లవి: సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 1: జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక వచనములచే తోషించి యాశ్రితుల పోషించి ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 2: వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వగీషులు సేవింప మేను పులకరింప ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 3: ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

వాతాపి గణపతిం భజే ( Vatapi Ghana Pathim Bhaje - LYRICS )

రచన :   ముత్తుస్వామి దీక్షితార్ రాగం :  హంసధ్వని తాళం :  ఆది భాష :  సంస్కృతం పల్లవి: వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరా ప్రదం శ్రీ  ||వాతాపి|| అనుపల్లవి: భూతాధి సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం  వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్న వారణం ||వాతాపి|| చరణం: పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మాధ్యగతం మురారీ ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం పరాధి చత్వా రివాగాత్మకం ప్రణవా స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విధ్రుతేక్షు తండం కరాంబుజపాశ భీజాపూరం కలుషవిదూరం భూతాకారం హరాధి గురుగుహ తోశిత బింబం హంసధ్వని భూషిత హేరంభం ||వాతాపి||

సామాజ వర గమన ( Samaja Vara Gamana - LYRICS)

రచన : శ్రీ త్యాగరాజ  పల్లవి: సామాజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత అనుపల్లవి: సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ చరణం: వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ