Skip to main content

Posts

కాల సంహార (Kaala Samhara)

కృతికర్త : శ్రీత్యాగరాజ  రాగం : సౌరాష్ట్ర  తాళం : ఆది   పల్లవి : కాల సంహార కరుణాకర  కైవల్యప్రద కమనీయానన  అనుపల్లవి : శీల  శూల ధారి వేగమే  బాల సుచరితుని పాలించిన      || కాల సంహార ||  చరణం : పూర్ణ కటాక్షములో పునర్జన్మములేక  పుణ్యము చేయు కీర్తితో నా యెడ  గణ్య కార్యమును గురుతు తెలుపవే  జగాన శ్రీత్యాగరాజ నమ్మిన       || కాల సంహార || 

గోవింద సుందర (Govinda Sundara)

కృతికర్త : శ్రీరామదాసు   తాళం : త్రిపుట   రాగం : మోహనం  పల్లవి: గోవింద సుందర మోహన దీన మందార గరుడ వాహన భవబంధాది దుష్కర్మ  దహన భక్తవత్సల త్రిలోక పావన  చరణం 1: సతి సుతులపై ప్రేమ రోసితి  సంతతము మీపై భారము వేసితి  మదిలోన మిము కనులజూడగ నెంచి  మీదయ కెపుడెదురెదురు జూచితి  చరణం 2: చాల దినములనుండి వేడితినే   కాలహరణము చేసి గనలేనైతి  మేలు నీ నామము పాడితి   మేలుగా ముందటి విధమున వేడితి   చరణం 3:  దీనరక్షకుడవని వింటిని నీ   కనికర మే తీరున గందును మానసమున నమ్మియుందును నా  మనవి చేకొన వేమందును  చరణం 4: అధికుడవని నమ్మినందుకు  ఆశ్రయించిన శ్రమబెట్టేదెందుకు మిము  వెతకి తెలిసే దెందుకు  మాకిది పూర్వకౄత మనేటందుకు  చరణం 5:   క్రోధాన వచ్చెను వార్థక్యము యిక  ప్రాపేది బహు సామీప్యము పదములు  విడనందు గోప్యమా  మీరెపుడు చూపెదరు స్వరూపము  చరణం 6: భద్రగిరియందు లేదేమొ యునికి  భక్తుల మొరవిని రావేమొ కర...

కన కన రుచిరా (Kana Kana Ruchira)

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: వరాళి తాళం: ఆది కన కన రుచిరా కనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమును మనసున చనువున నిన్ను కన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమున శ్రీయపార మహిమ కనరు నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ కన కన రుచిరా కనక వసన నిన్ను సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు కన కన రుచిరా కనక వసన నిన్ను మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే కన కన రుచిరా కనక వసన నిన్ను కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ మ...

హిమగిరి తనయే హేమలతే (Himagiri Tanaye Hemalathe)

రచన: శ్రీముత్తు స్వామి దీక్షితార్  రాగం : సుధా ధన్యాసి  తాళం: ఆది  పల్లవి: హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే .. మామవ  || హిమగిరి తనయే|| అనుపల్లవి: రమా వాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి       || హిమగిరి తనయే|| చరణం : పాశాంకుశేషు దండకరే అంబ  పరాత్పరే నిజ భక్తపరే ఆశాంబరే  హారికేశ విలాసే  ఆనంద రూపే అమిత ప్రతాపే        || హిమగిరి తనయే||   For Audio Link - Click Here

సఖి! హే కేశిమథన ముదారం (Sakhi Hey Kesimadhana Mudharam - LYRICS)

రచన : జయదేవ మహాకవి   రాగం : మాళవగౌడ   తాళం : ఏకతాళీ   భాష : సంస్కృతం   సఖి! హే కేశిమథన ముదారం రమయ మయా సహ మదన మనోరథ భావితయా స వికారమ్‌ ॥ నిభృత నికుంజ గృహం గతయా నిశి రహసి నిలీయ వసంతం । చకిత విలోకిత సకల దిశా రతి రభస భరేణ హసంతమ్‌ ॥ ప్రథమ సమాగమ లజ్జితయా పటు చాటు శతైరనుకూలం । మృదు మధుర స్మిత భాషితయా శిథిలీకృత జఘన దుకూలమ్‌ ॥ కిసలయ శయన నివేశితయా చిరమురసి మమైవ శయానం । కృత పరిరంభణ చుంబనయా పరిరభ్య కృతాధర పానమ్‌ ॥ అలస నిమీలిత లోచనయా పులకావలి లలిత కపోలం । శ్రమ జల సకల కళేబరయా వర మదన మదాదతిలోలమ్‌ ॥ కోకిల కలరవ కూజితయా జిత మనసిజ తంత్ర విచారం । శ్లథ కుసుమాకుల కుంతలయా నఖ లిఖిత ఘన స్తన భారమ్‌ ॥ చరణ రణిత మణి నూపురయా పరిపూరిత సురత వితానం । ముఖర విశృంఖల మేఖలయా సకచ గ్రహ చుంబన దానమ్‌ ॥ రతి సుఖ సమయ రసాలసయాదర ముకుళిత నయన సరోజం । నిస్సహ నిపతిత తనులతయా మధుసూదన ముదిత మనోజమ్‌ ॥ శ్రీ జయదేవ భణిత మిదమతిశయ మధు రిపు నిధువన శీలం । సుఖముత్కంఠిత గోప వధూ కథితం వితనోతు సలీలం ॥ Audio Link - Click Here

రంగపుర విహార (Rangapura Vihara - LYRICS)

కృతకర్త :  శ్రీ ముత్తుస్వామి దీక్షితర్  రాగం :  బృందావన సారంగ  తాళం :  రూపకం  పల్లవి: రంగపుర విహార జయ కోదండ- రామావతార రఘువీర శ్రీ            \\  రంగపుర విహార \\ అనుపల్లవి: అంగజ జనక దేవ బృందావన  సారంగేంద్ర వరద రమాంతరంగా   శ్యామళాంగ విహంగ తురంగ  సదయాపాంగ సత్సంగ               \\  రంగపుర విహార \\ చరణం: పంకజాప్త కుల జల నిధి సోమ  వర పంకజ ముఖ పట్టాభిరామ  పద పంకజ జిత కామ రఘురామ  వామాంక గత సీత వర వేష  శేషాంక శయన భక్త సంతోష  ఏణాంక రవి నయన మృదు-తర భాష  అకళంక దర్పణ కపోల విశేష ముని- సంకట హరణ గోవింద  వేంకటరమణ  ముకుంద  సంకర్షణ మూల కంద శంకర గురు గుహానంద              \\  రంగపుర విహార \\ Click on the Link to listen out the Keerthan -  https://gaana.com/song/rangapura-vihara-13

స్వాగతం కృష్ణ (Swagatham Krishna)

మధురాపురి సదనా మృదువదనా  మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా  భోగ ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా  కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద //స్వాగతం కృష్ణా// ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా  కువలయాపీడ మర్దన కాళింగ నర్తన  గోకులరక్షణ సకల సులక్షణ దేవా  శిష్ట జన పాల సంకల్ప కల్ప  కల్ప శత కోటి అసమపరాభవ  ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా  ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా  మధుర మధుర రతి సాహస సాహస  వ్రజ యువతి జన మానస పూజిత  స ,గప, గరి , ,ప గ రి స గ స ,  స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా  స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస  స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స  తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం  తకతరి కుకుంతన కితతకదీం  తకతరి కుకుంతన కితతకదీం  తకతరి కుకుంతన కితటక ధీం //స్వాగతం కృష్ణా// LInk to hear out this Keethan -  https://gaana.com/song/swagatham-krishna-41