Skip to main content

Posts

జయలక్ష్మి వరలక్ష్మి (Jaya Lakshmi Vara Lakshmi)

రచన : శ్రీతాళ్ళపాక అన్నమాచార్య  రాగం : లలిత   పల్లవి : జ యలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ చరణాలు : పాలజలనిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మ చందురుతోడబుట్టిన సంపదల మెరగువో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై వుందానవు మా యింటనే వుండవమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమ చెదరని వేదముల చిగురు బోడి ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ

శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే (Sri Saraswati Namosthuthe Varade)

కృతికర్త : శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రాగం : ఆరభి తాళం : రూపకం భాష : సంస్కృతం పల్లవి: శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధియువతే చరణం: వాసనాత్రయ వివర్జిత వరముని భావిత మూర్తే వాసవాద్యఖిల నిర్జర వర వితరణా బహుకీర్తే ధరహాసయుత ముఖాంభోరుహే అద్భుత చరణాంభోరుహే సంసార భీత్యాపహే సకల మంత్రాక్షర గుహే Meaning : O Sri Saraswati, Supreme Goddess, I pray to you. Your are adored by Lord Vishnu (Sripati), Lord Siva (Gowripati) and Lord Shanmukha and are the consort of Lord Brahma. You are the remover of three longing desires (to acquire land, wealth and women), worshipped by demigods and sages. You are the bestower of boons to all the gods and people including Lord Vishnu. You are of great fame and repute. Your lotus-like face always wears a beautiful smile. Your feet are made from the beautiful lotus flower. You remove fear of the cycle of birth and death and hold the secret of all syllables in hymns. Source:  https://karnatik.com...

కాల సంహార (Kaala Samhara)

కృతికర్త : శ్రీత్యాగరాజ  రాగం : సౌరాష్ట్ర  తాళం : ఆది   పల్లవి : కాల సంహార కరుణాకర  కైవల్యప్రద కమనీయానన  అనుపల్లవి : శీల  శూల ధారి వేగమే  బాల సుచరితుని పాలించిన      || కాల సంహార ||  చరణం : పూర్ణ కటాక్షములో పునర్జన్మములేక  పుణ్యము చేయు కీర్తితో నా యెడ  గణ్య కార్యమును గురుతు తెలుపవే  జగాన శ్రీత్యాగరాజ నమ్మిన       || కాల సంహార || 

గోవింద సుందర (Govinda Sundara)

కృతికర్త : శ్రీరామదాసు   తాళం : త్రిపుట   రాగం : మోహనం  పల్లవి: గోవింద సుందర మోహన దీన మందార గరుడ వాహన భవబంధాది దుష్కర్మ  దహన భక్తవత్సల త్రిలోక పావన  చరణం 1: సతి సుతులపై ప్రేమ రోసితి  సంతతము మీపై భారము వేసితి  మదిలోన మిము కనులజూడగ నెంచి  మీదయ కెపుడెదురెదురు జూచితి  చరణం 2: చాల దినములనుండి వేడితినే   కాలహరణము చేసి గనలేనైతి  మేలు నీ నామము పాడితి   మేలుగా ముందటి విధమున వేడితి   చరణం 3:  దీనరక్షకుడవని వింటిని నీ   కనికర మే తీరున గందును మానసమున నమ్మియుందును నా  మనవి చేకొన వేమందును  చరణం 4: అధికుడవని నమ్మినందుకు  ఆశ్రయించిన శ్రమబెట్టేదెందుకు మిము  వెతకి తెలిసే దెందుకు  మాకిది పూర్వకౄత మనేటందుకు  చరణం 5:   క్రోధాన వచ్చెను వార్థక్యము యిక  ప్రాపేది బహు సామీప్యము పదములు  విడనందు గోప్యమా  మీరెపుడు చూపెదరు స్వరూపము  చరణం 6: భద్రగిరియందు లేదేమొ యునికి  భక్తుల మొరవిని రావేమొ కర...

కన కన రుచిరా (Kana Kana Ruchira)

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: వరాళి తాళం: ఆది కన కన రుచిరా కనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమును మనసున చనువున నిన్ను కన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమున శ్రీయపార మహిమ కనరు నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ కన కన రుచిరా కనక వసన నిన్ను సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు కన కన రుచిరా కనక వసన నిన్ను మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే కన కన రుచిరా కనక వసన నిన్ను కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ మ...

హిమగిరి తనయే హేమలతే (Himagiri Tanaye Hemalathe)

రచన: శ్రీముత్తు స్వామి దీక్షితార్  రాగం : సుధా ధన్యాసి  తాళం: ఆది  పల్లవి: హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే .. మామవ  || హిమగిరి తనయే|| అనుపల్లవి: రమా వాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి       || హిమగిరి తనయే|| చరణం : పాశాంకుశేషు దండకరే అంబ  పరాత్పరే నిజ భక్తపరే ఆశాంబరే  హారికేశ విలాసే  ఆనంద రూపే అమిత ప్రతాపే        || హిమగిరి తనయే||   For Audio Link - Click Here

సఖి! హే కేశిమథన ముదారం (Sakhi Hey Kesimadhana Mudharam - LYRICS)

రచన : జయదేవ మహాకవి   రాగం : మాళవగౌడ   తాళం : ఏకతాళీ   భాష : సంస్కృతం   సఖి! హే కేశిమథన ముదారం రమయ మయా సహ మదన మనోరథ భావితయా స వికారమ్‌ ॥ నిభృత నికుంజ గృహం గతయా నిశి రహసి నిలీయ వసంతం । చకిత విలోకిత సకల దిశా రతి రభస భరేణ హసంతమ్‌ ॥ ప్రథమ సమాగమ లజ్జితయా పటు చాటు శతైరనుకూలం । మృదు మధుర స్మిత భాషితయా శిథిలీకృత జఘన దుకూలమ్‌ ॥ కిసలయ శయన నివేశితయా చిరమురసి మమైవ శయానం । కృత పరిరంభణ చుంబనయా పరిరభ్య కృతాధర పానమ్‌ ॥ అలస నిమీలిత లోచనయా పులకావలి లలిత కపోలం । శ్రమ జల సకల కళేబరయా వర మదన మదాదతిలోలమ్‌ ॥ కోకిల కలరవ కూజితయా జిత మనసిజ తంత్ర విచారం । శ్లథ కుసుమాకుల కుంతలయా నఖ లిఖిత ఘన స్తన భారమ్‌ ॥ చరణ రణిత మణి నూపురయా పరిపూరిత సురత వితానం । ముఖర విశృంఖల మేఖలయా సకచ గ్రహ చుంబన దానమ్‌ ॥ రతి సుఖ సమయ రసాలసయాదర ముకుళిత నయన సరోజం । నిస్సహ నిపతిత తనులతయా మధుసూదన ముదిత మనోజమ్‌ ॥ శ్రీ జయదేవ భణిత మిదమతిశయ మధు రిపు నిధువన శీలం । సుఖముత్కంఠిత గోప వధూ కథితం వితనోతు సలీలం ॥ Audio Link - Click Here